షుగర్ ఉందా? జామ ఆకులు తింటే ఏమవుతుందో తెలుసా?
షుగర్ ఉన్నవారికి జామ ఆకులు మేలు చేస్తాయా? శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం అనేది ప్రతి మధుమేహ రోగికి చాలా ముఖ్యమైన పని. ఆయుర్వేదంలో మరియు సాంప్రదాయ వైద్య విధానాల్లో జామ ఆకులను రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఉపయోగిస్తారు. జామ ఆకుల ప్రయోజనాలు: చక్కెర స్థాయిలను నియంత్రణ: జామ ఆకుల్లో పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు, టానిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ పెరగకుండా నియంత్రించడంలో సహాయపడతాయి. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరిచి, చెడు కార్బోహైడ్రేట్ల ప్రభావాన్ని తగ్గిస్తాయి. జీర్ణ వ్యవస్థకు మేలు: జామ ఆకులు ఆంతర వాయువులను తగ్గించి , అజీర్ణాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. నేరుగా నోట్లో నమిలితే లేదా కషాయంగా తీసుకుంటే అతిసారం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది. శరీరంలోని వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది: జామ ఆకుల్లో ఆంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల అవి శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరిగి , శరీరం బలంగా ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది: జామ ఆకులలో ఉండే...